విజయనగరం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 33 వేల మంది రైతులు సుమారు 44 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో దిగుబడి 30 శాతం దాటలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్నకు రూ.2,500 మద్దతుధర కల్పించి.. రైతుల నుంచి కొనుగోలు చేయాలని తెదేపా విజయనగరం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు.