పుర ఎన్నికల్లో సమిష్టిగా పని చేయకపోవటం కారణంగా జిల్లాలో అన్ని స్థానాలు కోల్పోయామని మాజీ శాసన సభ్యురాలు మీసాల గీత అన్నారు. ఈ లోపాన్ని అధిగమించి భవిష్యత్తులో ముందుకెళ్తామన్నారు. ఎన్నికల ఫలితాలపై విజయనగరంలోని కంటోన్మెంట్ తెదేపా కార్యాలయంలో తెదేపా నేత కొండపల్లి అప్పలనాయుడుతో కలిసి ఆమె అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతికూల పరిస్థితులు.. అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని గెలుపొందిన అభ్యర్ధులకు అభినందనలు తెలిపారు. గెలిచిన అభ్యర్ధులు మరింత బాధ్యతగా మెలగాలని.. ఓడిపోయిన వారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు.
'లోపాన్ని అధిగమించి భవిష్యత్తులో ముందుకెళ్తాం' - today ex mla meesala geeta press meet
ఎన్నికల ఫలితాలపై మాజీ శాసన సభ్యురాలు మీసాల గీత, తెదేపా నేత కొండపల్లి అప్పలనాయుడు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నాయకత్వ లోపం.. సమిష్టిగా కృషి చేయకపోవటం కారణంగానే ఓటమి చూడాల్సి వచ్చిందన్నారు.
మాజీ శాసన సభ్యురాలు మీసాల గీత
ఎన్టీఆర్ నమ్మిన సిద్దాంతం మేరకు సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు నినాదానికి కట్టుబడి ఉన్నామన్నారు. నిన్నటి ఫలితాలను సమీక్షించుకొని రానున్న రోజుల్లో సమిష్టిగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
ఇవీ చూడండి...