ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'290 మంది పేదలకు ఆనాడే పట్టాలిచ్చారు.. ఇప్పటికీ భూమి ఇవ్వలేదు' - poor people houses at vizianagaram news update

గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినప్పటికీ... వారికి ఇంతవరకు స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని విజయనగరం జిల్లా తెదేపా నేతలు డిమాండ్ చేశారు. భోగాపురం తహసీల్దార్ కు.. వినతి పత్రం అందజేశారు.

tdp leader mpp bangar raju
తహసీల్దార్​కు వినతి పత్రం అందజేస్తున్న మాజీ ఎంపీపీ బంగార్రాజు

By

Published : Jun 16, 2020, 6:48 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం మేజర్ పంచాయతీలో 290 మంది పేద ప్రజలకు గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినా.. వారికి ఇంతవరకు స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని పార్టీ మాజీ ఎంపీపీ బంగార్రాజు.. మండల తహసీల్దార్​ను డిమాండ్​ చేశారు.

గొల్లపేట ప్రాంతంలో వారందరికీ గృహాలు కట్టుకునేందుకు వీలుగా స్థల పరిశీలన చేసి అప్పటి ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఎన్నికలు రాగా.. స్థలాలను చదును చేయకుండా వదిలేరన్నారు.

ABOUT THE AUTHOR

...view details