విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మూడో రోజు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కిమిడి నాగార్జున అమ్మవారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి.. రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. అమ్మవారి జాతరకు వస్తున్న లక్షలాది మంది భక్తులకు అమ్మవారి అశిస్సులుండాలని ఆకాంక్షించారు.
కనకమహాలక్ష్మి అమ్మవారి సేవలో తెదేపా నేత కిమిడి నాగార్జున - today Kanakamahalakshmi Ammavari jatara news update
తెలుగుదేశం పార్టీ నాయకుడు కిమిడి నాగార్జున చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలో మూడో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
![కనకమహాలక్ష్మి అమ్మవారి సేవలో తెదేపా నేత కిమిడి నాగార్జున TDP leader Kimidi Nagarjuna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11030390-1032-11030390-1615890416734.jpg)
కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తెదేపా నేత కిమిడి నాగార్జున