విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...విజయనగరం తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి రైతుల అరెస్టులను నిరసిస్తూ...తెదేపా చేపట్టిన చలో గుంటూరు కార్యక్రమానికి బయలుదేరిన నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు.
తెదేపా నేత కిమిడి నాగార్జున గృహనిర్బంధం - తెదేపా నేత కిమిడి నాగార్జున హెస్ అరెస్టు
అమరావతి రైతుల అరెస్టులకు నిరసనగా తెదేపా చలో గుంటూరు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన విజయనగరం తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

house arrest
రాజధానికి భూములిచ్చిన రైతులను అరెస్టు చేయడాన్ని తెదేపా ఖండిస్తుందని కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. రైతులకు సంకెళ్లు వేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని విమర్శించారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న తెదేపా శ్రేణులను పోలీసుల అండతో అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :తరగతుల నిర్వహణ, ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలు జారీ