మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నట్లు రాష్ట్రం బాగుంటే.. విశాఖ భూముల్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని విజయనగరం పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రశ్నించారు. ఇసుక, సిమెంట్, మద్యం, నిత్యావసరాల ధరలు, ఆస్తిపన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు పెంచటమే ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధా అని నిలదీశారు. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రను, ముఖ్యంగా విశాఖ నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
సొంత జిల్లా విజయనగరానికి బొత్స ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వం పూర్తి చేసిన తోటపల్లి ప్రాజెక్ట్ బ్యారేజీలో పూడిక కూడా తీయలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని నాగార్జున ఆక్షేపించారు.