రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు సీఎం కావాలని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. జగన్... విజన్ లేని నాయకుడని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఎలాంటి ఆలోచన చేయట్లేదని ఆరోపించారు. విజయనగరం తెదేపా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశమయ్యారు. జగన్ ప్రభుత్వం దుర్భర పరిస్థితిలో ఉందని దుయ్యబట్టారు. ఎరువులు, విత్తనాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆర్బీకేలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని కళా వెంకట్రావు అన్నారు.
సీఎం జగన్.. విజన్ లేని నాయకుడు: కళా వెంకట్రావు - tdp comments on ysrcp government
సీఎం జగన్.. విజన్ లేని నాయకుడని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం దుర్భర పరిస్థితిలో ఉందన్నారు. విజయనగరం తెదేపా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశమయ్యారు.
tdp leader kala venkatrao comments on cm jagan