తెదేపా... నేతలను తయారుచేసే ఫ్యాక్టరీ అనీ... ఎవరు ఉన్నా, లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తామని ఆ పార్టీ నేత కళా వెంకట్రావు పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజధానిపై మంత్రులు పూటకోమాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 22 మంది ఎంపీలుంటే ప్రత్యేకహోదా తెస్తానని చెప్పిన సీఎం జగన్... ఇప్పుడెందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో వైకాపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'22 మంది ఎంపీలున్నారుగా... ప్రత్యేకహోదా ఏమైంది..?' - వైకాపా ప్రభుత్వంపై కళా వెంకట్రావు విమర్శలు
22 మంది ఎంపీలుంటే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్... ఇప్పుడెందుకు మాట్లాడటంలేదని... తెదేపా కీలకనేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. వైకాపా నేతలంతా స్వార్థపూరిత ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు.
కళా వెంకట్రావు