ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KALA VENKARTRAV: 'రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి.. 23 మంది ఎంపీలను తాకట్టుపెట్టారు' - farmer minister kala venkatrav fire on YCP government

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తెదేపా నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోని వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా 23 మంది ఎంపీలను కేంద్రానికి తాకట్టు పెట్టారని కళా వెంకట్రావు మండిపడ్డారు.

తెదేపా నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు
తెదేపా నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు

By

Published : Aug 14, 2021, 5:25 PM IST

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లఖానపురంలో తెదేపా నేత కుమారుడి వివాహ వేడుకకు మాజీ మంత్రి కళా వెంకట్రావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైకాపా అధికారంలోని వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవని కళా వెంకట్రావు ఆక్షేపించారు. రాష్ట్రానికి నూతన పరిశ్రమలను తీసుకురావడంలో వైకాపా సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా 23 మంది ఎంపీలను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని.. రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరు కానప్పుడు పరిపాలన ఏ విధంగా సాగుతుందని వెంకట్రావు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details