ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శంకుస్థాపన జరిగి రెండేళ్లయినా.. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించలేదు' - tdp leaders on road extension works at ainada

విజయనగరం జిల్లాలో అయినాడ జంక్షన్​ నుంచి ధర్మపురి మీదుగా రింగ్​ రోడ్డు ఐస్​ ఫ్యాక్టరీ జంక్షన్​ వరకు రహదారి విస్తరణ చేపట్టాలని తెదేపా నాయకురాలు అధితి గజపతి రాజు.. జేసీ సింహాచలానికి వినతిపత్రం అందించారు. శంకుస్థాపన జరిగి.. రెండేళ్లయినా పనులు ప్రారంభం కాలేదని ఫిర్యాదు చేశారు.

tdp leader deamand to extend road at ainada
tdp leader deamand to extend road at ainada

By

Published : Jan 25, 2021, 10:06 PM IST

విజయనగరం జిల్లాలో అయినాడ జంక్షన్​ నుంచి ధర్మపురి మీదుగా రింగ్​ రోడ్డు ఐస్​ ఫ్యాక్టరీ జంక్షన్​ వరకు రహదారి విస్తరణ చేపట్టాలని తెదేపా నేత అధితి గజపతి రాజు డిమాండ్​ చేశారు. రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా.. పనులు ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి విజయనగరం పట్టణం మీదుగా చీపురుపల్లి, రాజాం, పాలకొండ వెళ్లే వాహనాలకు ఈ రహదారి ఎంతో ఉపయోగమన్నారు. రహదారి గతుకులమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతన్నారని అధితి గజపతి రాజు అన్నారు. రహదారి విస్తరణ పనులు చేపట్టాలని తెదేపా నేతలు.. గ్రీవెన్స్​లో జేసీ సింహాచలంకు వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details