వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుందని ఆరోపిస్తూ.. విజయనగరం జిల్లా సాలూరు ఎమ్ఆర్వో కార్యాలయం జంక్షన్ వద్ద తెదేపా నేతలు కొవ్వొత్తులతో నిరసన చేశారు. తెదేపా నేతల అరెస్టులను నిరసిస్తూ... ఎఫ్ఐఆర్ కాపీని దహనం చేశారు. ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం తెదేపాపై కక్షసాధింపు ధోరణికి పాల్పడుతుందని ఆరోపించారు.
సాలూరులో తెదేపా నేతల నిరసన - విజయనగరం వార్తలు
తెదేపా నేతల అరెస్టులకు నిరసనగా... ఆ పార్టీ శ్రేణులు విజయనగరం జిల్లా సాలూరులో కొవ్వొత్తులతో ఆందోళన చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు ఆందోళనచేపట్టారు.
సాలూరులో తెదేపా నేతల నిరసన