ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక పాలనే' - vizianagaram district latest news

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి పరిపాలన సాగుతోందని తెదేపా మాజీ ఎమ్మెల్యే భంజ్​దేవ్​ మండిపడ్డారు. 'వైకాపా విధ్వంసానికి ఒక్క ఛాన్స్' అనే పేరుతో.. సాలూరులో గోడపత్రికను ఆవిష్కరించారు.

'వైకాపా విధ్వంసానికి ఒక్క ఛాన్స్' పేరుతో గోడపత్రిక విడుదల
'వైకాపా విధ్వంసానికి ఒక్క ఛాన్స్' పేరుతో గోడపత్రిక విడుదల

By

Published : Jun 9, 2020, 7:22 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్...‌ 'వైకాపా విధ్వంసానికి ఒక్క ఛాన్స్' అనే పేరుతో గోడపత్రికను విడుదల చేశారు. ఏడాది పాలనలో ఏమి జరిగిందని వైకాపా నేతలు పండుగ జరుపుకొంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి పరిపాలన సాగుతోందని ఆగ్రహించారు.

కరోనా వంటి కష్ట సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. డాక్టర్ సుధాకర్​.. ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇంటికి రావాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details