ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను గౌరవించాలి: అశోక్​ గజపతిరాజు - TDP leader Ashok Gajapathi Raju

వైకాపా నేతలు హిందూ ఆలయాల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు తెదేపా సీనియర్ నేత అశోక్​ గజపతిరాజు. విజయనగరంలో వినాయకుడిని సందర్శించుకున్న ఆయన.. చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP leader Ashok Gajapathi Raju
TDP leader Ashok Gajapathi Raju

By

Published : Sep 10, 2021, 3:28 PM IST

విజయనగరం సిటీ బస్టాండ్ వద్ద ఉన్న సిద్ధి వినాయకుని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా నేత అశోక్​ గజపతిరాజు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందర్నీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు.

అన్ని మతాలను గౌరవించాలి

వైకాపా ప్రభుత్వ తీరుపై అశోక్​ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఆంక్షలు అమలు చేస్తే అన్నింటికి వర్తింపజేయాలి కానీ.. కేవలం వినాయక చవితి వేడుకలకు కాదన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను గౌరవించాలన్నారు. కోర్టులే లేకపోతే.. తమను ఎప్పుడో జైల్లో వేసేవారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడాలన్నారు. వైకాపా నేతలు హిందూ ఆలయాల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. బెయిల్ పై బయటికి వచ్చిన వ్యక్తి వరహాలక్ష్మి దేవాలయానికి ఛైర్మన్​గా ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి

AP NEW CS: ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ

ABOUT THE AUTHOR

...view details