ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం తెదేపాలో విభేదాలు...మీసాల గీత తీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి - తెదేపా నేత అశోక్ గజపతి రాజు వార్తలు

విజయనగరం తెదేపాలో వర్గ విభేదాలు వెలుగుచూస్తున్నాయి. అశోక్ గజపతి రాజుకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నూతనంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించటంతో నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఆమె తీరుపై వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని రెండుగా చీల్చడం సరికాదని హితవు పలికారు.

vizianagaram tdp
vizianagaram tdp

By

Published : Dec 11, 2020, 4:43 PM IST

విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు వ్యతిరేకంగా తెదేపా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నూతనంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించటంతో నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వారు విజయనగరంలోని అశోక్ గజపతిరాజు బంగ్లాలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత... పార్టీ కార్యాలయం పెట్టాలనుకున్నప్పుడు జిల్లాలోని పెద్దల అనుమతి తీసుకుని ఉండాల్సిందని తెదేపా నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీని రెండుగా చీల్చడం సరికాదన్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ స్థాపించినప్పటి నుంచి దశదిశ నిర్దేశిస్తున్న అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా కార్యాలయం ప్రారంభించడం బాధాకరమన్నారు. 38ఏళ్లుగా ఆయన అడుగు జాడల్లోనే విజయనగరం జిల్లాలో పార్టీ ముందడుగు వేస్తుందనారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలతో చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా జిల్లా నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యక్రమాలన్నీ అశోక్‌ బంగ్లా వేదికగా సాగేవి. బుధవారం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ప్రత్యేకంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయం అవసరం ఉందని ప్రారంభించడం చర్చనీయాంశమైంది. పెద్దాసుపత్రి కూడలి సమీపంలో నియోజకవర్గ కార్యాలయాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. తెదేపాను బలహీనపరిచే కుట్రలో ఇదొక భాగమని పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు ఆరోపించారు. బంగ్లాకు తానెప్పుడూ పార్టీ కార్యాలయంగా బోర్డు పెట్టలేదన్నారు. వచ్చే వారికి ఎటువంటి ఆంక్షలను విధించలేదని ఆయన బదులిచ్చారు. మరోవైపు ప్రజలకు సేవ చేసేందుకు కలిసి పని చేయాలనే ఆలోచనతోనే కార్యాలయాన్ని ప్రారంభించానని గీత చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details