విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెదేపా ఆధ్యర్యంలో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు ఆందోళన తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం తగదన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పై ప్రభావం చూపకుండా.. వెంటనే పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి విద్యార్థుల జీవితాలను కాపాడాలని కోరారు.
పరీక్షలు రద్దు చేయండి: విద్యార్థి సంఘాలు - ఏపీ తాజా వార్తలు
తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చీపురుపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యార్థి నాయకులు నిరసనకు దిగారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం తగదన్నారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
tdp demands