వైకాపా పాలనపై తహసీల్దార్లకు తెదేపా నేతల ఫిర్యాదు - tdp complained to tahsildars over ycp ruling
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గత ఏడాదిగా వైకాపా అరాచక పాలన చేస్తోందని చీపురుపల్లి, గరివీడి, మెరకముడిథం, గుర్లా మండలాల తహసీల్దార్లకు తెదేపా నాయకులు వినతిపత్రాలు సమర్పించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలో నియోజకవర్గంలో మహిళలు, దళితులు, బీసీలపై దాడులు పెరిగాయని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం తెదేపా నాయకులు ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. ఇసుకను, మట్టినీ అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాలు, మద్యం అమ్మకాల్లో అక్రమాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయని విమర్శించారు. వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. అంతేకాక తెదేపా మహిళా కార్యకర్తలను వేధిస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై తగిన చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి, గరివీడి, మెరకముడిథం, గుర్లా మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు.