విజయనగరం పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల తెదేపా అభ్యర్ధులు అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు ప్రచారం ముమ్మరం చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ తెదేపా మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ... ఓట్లను అభ్యర్థించారు. తెదేపా ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి