ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్రాలు ఉన్న వారిని పట్టుకోవడమేమిటి? - tammineni seetha ram comments on sand mining

ఎడ్లబండ్లపై ఇసుక తీసుకెళ్లే వారిపైన అధికారులు కేసులు పెట్టడమేంటని శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల్ని వదిలిపెట్టి అన్ని పత్రాలూ ఉన్న సామాన్యులను పట్టుకోవడమేంటి అని నిలదీశారు.

tammineni seetha ram on sandmining in srikakulam
తమ్మినేని సీతారాం

By

Published : Nov 5, 2020, 9:59 AM IST

Updated : Nov 5, 2020, 2:22 PM IST

అధికారులపై సభాపతి ఆగ్రహం

ప్రభుత్వ పనులకు ఇసుక తీసుకెళ్తుంటే అధికారులు అడ్డుకోవడంపై శాసనసభాపతి తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉపాధిహామీ పనులపై అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ‘సెబ్‌ అని.. తుబ్‌ అని.. ఎన్నో వచ్చాయి. ఎడ్లబండ్లపై ఇసుక తీసుకెళ్లే వారిపైనా అధికారులు కేసులు పెట్టడమేంటని సీతారాం మండిపడ్డారు. ప్రభుత్వ పనుల నిమిత్తం గ్రామ సచివాలయం, ఇతర రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలు చూపించినా వదిలిపెట్టడం లేదని, కొందరు అధికారులు వారి శాఖలకు అతీతుల్లా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

పెద్దల్ని వదిలిపెట్టి అన్ని పత్రాలూ ఉన్న సామాన్యులను పట్టుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇకపై జరిగే సమీక్షలకు సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో), మైనింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా ఇసుక అధికారి.. అందరినీ పిలవాలని, వాళ్లంతా వస్తే తలుపులు వేయాల్సిన పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు. స్పీకర్‌గా ఉన్న తాను అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, అయినా పరిస్థితులు అలా మారుతున్నాయని పేర్కొన్నారు.

Last Updated : Nov 5, 2020, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details