ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 20, 2020, 6:20 AM IST

ETV Bharat / state

'లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని... విఎంఆర్డీఏ ప్రణాళిక అధికారి పిఎన్ఎస్ సాయిబాబు సూచించారు. విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈ పథకం విధివిధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

'Take advantage of layout regulation scheme'
సాయిబాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని... వీఎంఆర్డీఏ ప్రణాళిక అధికారి పిఎన్ఎస్ సాయిబాబు సూచించారు. విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రణాళిక కార్యదర్శులు, అధీకృత సర్వేయర్లకు లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం విధివిధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. డిసెంబర్ నెలాఖరుతో పథకం కాల పరిమితి పూర్తవుతుందని చెప్పారు. అప్పటి వరకు అనధికార లేఅవుట్లన్నీ ఈ పథకం కింద క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందన్నారు.

కాలపరిమితిలోగా అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రణాళిక కార్యదర్శులు, సాంకేతిక సిబ్బందిపై ఉందని సాయిబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్పారు. అనధికార లేఅవుట్​లో గృహ నిర్మాణాలకు ప్లాన్ లభించదని, బ్యాంకు రుణాలు మంజూరు కావని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నింటిపై సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై ప్రణాళిక కార్యదర్శులు, అధీకృత సర్వేర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఇదీ చదవండీ... రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు- మళ్లీ కర్ఫ్యూ భయాలు

ABOUT THE AUTHOR

...view details