విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని కొన్ని షాపుల్లో ధరల తీరు తెలుసుకునేందుకు తహసీల్దార్ బయలుదేరారు. లక్క, గుడ్డ ముక్కను తీసుకువెళ్తుండగా కత్తెర అవసరం ఉంటుందని తమతో వచ్చిన వారికి చెప్పారు. కొనడానికి పంపించారు. కత్తెర రేటు పదిహేను రూపాయలు కాగా ఓ జనరల్ స్టోర్ నిర్వాహకుడు 30 రూపాయలు అమ్మాడు. తహసీల్దార్ చేతికి అడ్డంగా చిక్కాడు. ఎక్కువ ధరలకు అమ్మిన కారణంగా.. ఆ దుకాణాన్ని తహసీల్దా ర్ సీజ్ చేశారు.
15 రూపాయల కక్కుర్తి షాపును సీజ్ చేయించింది! - విజయనగరంలో అధిక ధరలకు అమ్మిన దుకాణం సీజ్
మరి మరీ చెప్పారు. ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినలేదు కదా.. పైగా తహసీల్దార్కే ఎక్కువ ధరకు అమ్మాడు. 15 రూపాయలకు కక్కుర్తి పడి దుకాణాన్ని తన అంతట తానే సీజ్ చేయించుకున్నాడు.
tahsildar-seized-the-shop-for-seeling-high-prices-at-saluru-in-vizianagaram