మనం గగనతలంలో గానీ సముద్రాల్లో గానీ ప్రయాణం చేయాలంటే.. దిక్సూచి ఆధారంగా ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ కొంగలు ఒక్కసారి వచ్చి వెళ్తే గుర్తు పెట్టుకుంటాయి. అలా వచ్చి ఏటా విజయనగరం జిల్లా కొండదాడి గ్రామంలో ఆనందాన్ని పంచుతుంటాయి. ఇక్కడే నివాసం ఏర్పరచుకుంటాయి.
సైబీరియన్ నుంచి.. వచ్చే కొంగలు.. మన ఆంధ్రప్రదేశ్లో సుమారు ఎనిమిది.. కేంద్రాల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి దగ్గర తేలినీలాపురం, ఇచ్చాపురం దగ్గర తేలుకుంచి.. విశాఖ జిల్లాలో కొండకర్ల, గుంటూరు జిల్లా ఉప్పలపాడు, కృష్ణా జిల్లాలో అటపాక.. నెల్లూరులో నేలపట్టు, అనంతపురంలో వీరాపురం, కర్నూలులో రాళ్లపాడు ఇవి.. ఎనిమిది సంరక్షణ కేంద్రాలు. ఇప్పుడు విజయనగరం జిల్లా కొండదాడి గ్రామంలో కూడా ఈ పక్షులు సుమారు మూడు వేల నుంచి 5000 వరకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి.