విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో స్వచ్ఛంద లాక్ డౌన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కురుపాం తహశీల్దార్ కార్యాలయంలో వర్తక సంఘాలు, గ్రామ పెద్దలు, పోలీసులు కలిపి రెవెన్యూ అధికారులు ఈ విషయమై సమావేశం ఏర్పాటు చేశారు.
మంగళవారం నుంచి జూలై 15 వరకు మండలంలో లాక్ డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ తహశీల్దార్ రమణారావు, ఎస్ఐ కె.రమణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.