ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కఠినంగా కర్ఫ్యూ.. అభాగ్యులకు అండగా మానవ హక్కుల పాలక సంస్థ - Vizianagaram district homeless people

కరోనా నియంత్రణ కోసం కర్ఫ్యూ అమలవుతోంది. నిరాశ్రయులు, భిక్షాటన చేసుకునేవారికి తిండి లేకుండా పోయింది. వారికి విజయనగరం జిల్లా కేంద్రంలోని జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ అండగా నిలుస్తోంది. దాతలు స్పందించి అభాగ్యులకు సాయం చేయాలని ఆ సంస్థ కోరుతోంది.

  Supply of food to homeless people in Vizianagaram district
నిరాశ్రయులకు ఆహారం సరఫరా

By

Published : May 9, 2021, 8:31 PM IST

విజయనగరం జిల్లా కేంద్రంలో కరోనా కర్ఫ్యూ కఠినంగా అమలవుతోంది. నిత్యం.. విధించడంతో కూడు, గూడు లేక పుట్‌పాత్‌లే ఆధారంగా కాలం వెళ్లదీసే అనాథలు ఎంతోమంది ఉన్నారు. కరోనా వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి.. మేమున్నామంటూ జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ అండగా నిలుస్తోంది. రోజూ ఆహారం, శీతల పానీయాలు, నీరు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అంతేకాకుండా కరోనా విధుల్లో ఉన్న సిబ్బందికి అండగా నిలుస్తున్నారు. తిండిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టామని సంస్థ జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి సంతోష్ కుమార్ అన్నారు. అదే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు స్వచ్చంద సంస్దలు ముందుకు రావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభాగ్యులు, భిక్షాటన చేసుకునే వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details