విజయనగరంలోని శంబర పోలమాంబ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖర్ ఆదేశించారు. ముందుగా చదురు గుడిలో అమ్మవారిని దర్శించుకున్న ఆయన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి బీఎల్ నగేష్ కండువాలతో సత్కరించారు. ఆలయానికి భక్తుల రాకపోకలు, తదితర ఏర్పాట్ల వివరాలను ఆలయ ఈఓని అడిగి తెలుసుకున్నారు. జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం గుడి వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఆలయంలోని నీలాటి రేవు ప్రాంతంలో చెత్త పేరుకుపోయి, తీవ్ర దుర్వాసన వెదజల్లడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే మరుగుదొడ్ల పనితీరు, కేశఖండన ప్రదేశానికి సంబందించిన వివరాల పై ఆరా తీశారు. జాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం వనం గుడి ప్రదేశాన్ని పరిశీలించారు. జాతర సందర్భంగా సిరుమాను తిరిగే ప్రదేశాలను, తిరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్‌తో పాటు ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి, ఆలయఈఓతో పాటు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
'జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి' - విజయనగరం న్యూస్
విజయనగరంలోని శంబర పోలమాంబ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖర్ ఆదేశించారు. అంతకుముందు చదురు గుడిలో అమ్మవారిని దర్శించుకున్న అతన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కండువాతో సత్కరించారు.
'జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి'