కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పార్వతీపురం నెల్లి చెరువు గట్టుపై నివాసముండే సోములు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సోములు.. మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సోములు ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అన్యోన్యంగా ఉండాల్సిన దంపతుల మధ్య మద్యం చిచ్చు రేపింది. చక్కగా సాగిపోతున్న జీవితంలో మనస్పర్థలు రేకెత్తించింది. అంతిమంగా ఓ వ్యక్తి ప్రాణం తీసుకుంది. వారి కుటుంబ సభ్యులను రోడ్డున పడేసింది. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఇదీచదవండి.తెలుగు ప్రజల అండతో ఇదంతా చేశాం:ఈనాడు ఎండీ కిరణ్