త్రివిధ దళాల సైనికులకు ఆప్కో వస్త్రాలపై 40శాతం రాయితీ ఇస్తున్నట్లు విజయనగరం జిల్లా ఏఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఉండే ఈ అవకాశాన్ని సైనికులు, వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక బాలాజీ మార్కెట్లోని ఆప్కో షోరూమ్ లో ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన కార్యక్రమంలో, నేతాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణలో ఇటీవల అసువులు బాసిన అమర జవాన్ రౌతు జగదీష్ తండ్రిని, ఆప్కో వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
ASP ANIL : 'త్రివిధ దళాల సైనికులకు ఆప్కో వస్త్రాలపై 40శాతం రాయితీ' - vizianagaram district
త్రివిధ దళాల సైనికులకు ఆప్కో వస్త్రాలపై 40శాతం రాయితీ ఇస్తున్నట్లు విజయనగరం జిల్లా ఏఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన కార్యక్రమంలో, నేతాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
విజయనగరం జిల్లా ఏఎస్పీ అనిల్ కుమార్