విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు. 88 మంది విద్యార్థినులకు ఒకటే మరుగుదొడ్డి ఉందని.. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తాము ఇంతగా ఇబ్బందులు పడుతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవటంలేదని విమర్శించారు. తక్షణమే సొంత భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.
సదుపాయాలు మెరుగు పరచాలంటూ విద్యార్థుల నిరసన - vizianagaram
తాము ఉండే వసతి గృహంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ పార్వతీపురంలో విద్యార్థినులు నిరసన చేపట్టారు.
నిరసన