విజయనగరంలో విషాదం.. కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థినులకు అస్వస్థత - ap news updates
10:24 February 07
కొత్తవలస బీసీ బాలికల హాస్టల్‌లో ఘటన
FOOD POISON IN BC GIRLS HOSTEL : విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. కొత్తవలసలోని బీసీ బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. ఉదయం అల్పాహారంగా పులిహోర తిన్న తర్వాత.. పాఠశాలకు వెళ్తూ వాంతులతో సొమ్ముసిల్లి పడిపోయారు. వెంటనే గమనించిన సిబ్బంది కొత్తవలస ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం 14 మంది కోలుకోగా.. మిగిలిన 10 మందికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి విద్యార్థినిలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: