ఎంఆర్ కళాశాలను ప్రైవేట్‌పరం చేయాలన్న ప్రతిపాదన ఉపసంహరించుకోమని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మంత్రి బొత్స సత్యనారాయణను కలవటానికి వెళ్లారు. అయితే పోలీసులు వారిని బొత్స ఇంటికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోలీసుల చర్యలు నిరసిస్తూ మంత్రి ఇంటి సమీపంలోనే విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మంత్రి బొత్స ఇంటికి వెళ్లేందుకు విద్యార్థుల యత్నం... నాయకుల అరెస్టు - మహారాజా కళాశాల వార్తలు
మహారాజా కళాశాలను ప్రైవేట్‌పరం చేయాలన్న ప్రతిపాదన ఉపసంహరించుకోమని చెప్పడానికి వెళ్లిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులను మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎంఆర్ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
విద్యార్థుల ఆందోళన
వేల మంది విద్యార్థులు చదువుకునే కళాశాలను ప్రైవేటీకరణ చేయడం తగదని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి... పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఎస్ ఆర్టీసీ లేఖ
Last Updated : Oct 13, 2020, 4:29 PM IST