విజయనగరం మిమ్స్ (మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాలేజ్)కు చెందిన పీజి మొదటి సంవత్సరం విద్యార్థి సంతోష్.. కళాశాల మొదటి అంతస్తుపై నుంచి దూకిన ఘటనలో అతని కాలు విరగింది.
వెంటనే అతన్ని తిరుమల ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా విద్యార్థి మానసిక పరిస్థితి బాగోలేదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.