జగనన్న వసతి దీవెన పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో శ్రీకారం చుట్టారు. అయితే సీఎం మాట్లాడే ముందు... నెల్లిమర్ల మండలం బొప్పడం ఉన్నత పాఠశాల విద్యార్థి అభిమన్యు చేసిన ప్రసంగం ముఖ్యమంత్రితో పాటు సభికులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 5 నిమిషాల పాటు ఆంగ్లంలో ప్రసంగించాడు ఆ విద్యార్ధి. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అనర్గళంగా చెప్పేశాడు. అలాగే సీఎం జగన్పై ప్రశంసలు కురిపించాడు. ఆ చిన్నారి మాటలకు సీఎం జగన్ చిరునవ్వులు చిందించారు. సీఎం జగన్ మా దేవుడు అంటూ అభిమన్యు తన ప్రసంగాన్ని ముగించాడు. అనంతరం ఆ బుడ్డోడిని సీఎం జగన్ దగ్గరకు తీసుకుని ముద్డాడి... కాసేపు ముచ్చటించారు.
అభిమన్యుడి ప్రసంగానికి జగన్మోహనుడు ఫిదా
విజయనగరంలో సోమవారం నిర్వహించిన సీఎం బహిరంగసభలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ప్రసంగంతో ముఖ్యమంత్రి జగన్ను ఫిదా చేశాడు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తడబడకుండా చెప్పేస్తూ... వాటిపై ప్రశంసలు కురిపించాడు.
cm jagan