విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని హారతి డయేరియా లక్షణాలతో మృతి చెందింది. వసతి గృహ సిబ్బంది, అధికారులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని కేదారిపురం కాలనీ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హారతి 2 రోజుల కిందట వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైంది. విద్యార్థినికి దగ్గరలోని ఆసుపత్రిలో వైద్యం అందించారు. అయినప్పటికి అస్వస్థత తీవ్రమవటంతో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.
డయేరియా లక్షణాలతో పదోతరగతి విద్యార్థిని మృతి - విజయనగరం జిల్లా తాజా వార్తలు
డయేరియా లక్షణాలతో గిరిజన విద్యార్థిని మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగింది. బాలిక కుటుంబాన్ని ఐటీడీఏ డీడీ రవికుమార్ పరామర్శించారు.
డయారియా లక్షణాలతో పదోతరగతి విద్యార్థిని మృతి
మార్గమధ్యలో విద్యార్థిని వాంతులు చేసుకుంది. ఆస్పత్రిలో ఆ బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి, చెల్లి ఆస్పత్రికి చేరుకోని కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. బాలిక కుటుంబాన్ని ఐటీడీఏ డీడీ రవికుమార్ ఆస్పత్రిలో పరామర్శించారు. వసతి గృహంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.