విజయనగరం జిల్లాలో ఎన్నికల నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. పార్వతీపురం డివిజన్లో పోలింగ్ నిర్వహణకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌లను కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికోన్నత పాఠశాల వై.టీ.సీ భవనాలతో పాటు ఉద్యాన కళాశాలను చూశారు. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని ఉంచేందుకు అనుకూలతలను, స్ట్రాంగ్ రూమ్ ఓట్ల లెక్కింపు కార్యక్రమాలకు అనువుగా ఉండే గదులను గుర్తించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నిక లు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
స్థానిక సమరానికి.. ముమ్మర ఏర్పాట్లు - District Collector Hari jawahar Lal latest news update
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్‌ను పరిశీలించారు. పార్వతీపురం డివిజన్లోని 15 మండలాలకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు.
![స్థానిక సమరానికి.. ముమ్మర ఏర్పాట్లు Strong rooms were inspected by District Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6357004-994-6357004-1583825669144.jpg)
స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
ఇవీ చూడండి...