విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఒడిశా ఘాట్ రోడ్డు సమీపంలోని కనకనపల్లిలో సుమారు నాలుగు నెలలుగా వింత వ్యాధి విస్తరిస్తోంది. ఫలితంగా గ్రామస్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. లాక్డౌన్ సమయంలో నలుగురు మరణించగా.. నవంబర్ ,డిసెంబర్ నెలల్లో మరో ఐదుగురు చనిపోయారు.
మృతికి కారణాలు తెలియక గిరిజనులు భయాందోళనకు లోనవుతున్నారు. పాచిపెంట పీహెచ్సీ పరిధిలోని వైద్య సిబ్బందికి కూడా మృతికి గల కారణాలు తెలుసుకోలేకపోతున్నారు. తాజాగా గ్రామానికి చెందిన గెమ్మేల రామకృష్ణ (21) అనే యువకుడు ఆదివారం అకస్మాత్తుగా మరణించాడు. తక్షణమే వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.