విజయనగరం జిల్లాలో 1134 ఖాళీలను భర్తీ చేయడానికి నేటి నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 45 వేల 467మంది దరఖాస్థు చేసుకున్నారు. 5క్లస్టర్లలో 88 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. విజయనగరం, ఎస్. కోట, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురంలో మొత్తం 88 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు పరీక్షలు నిర్వహించగా.. రెండో రోజు నుంచి కేవలం విజయనగరంలోనే మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సి ఉన్న ఓ అభ్యర్థి డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. అప్పటికే సమయం ముగిసిపోతుండగా సమీపంలోని పరీక్ష కేంద్రానికి పరుగులు తీశాడు.