ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 'జాతీయ సైన్స్ డే' - రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 'జాతీయ సైన్స్ డే'

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సాంకేతికత, పర్యావరణం వంటి అంశాలపై చేసిన ప్రయోగాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలను వీక్షించేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

STATE WICE NATIONAL SCIENCE DAY CELEBRATIONS
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 'జాతీయ సైన్స్ డే'

By

Published : Feb 28, 2020, 11:45 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 'జాతీయ సైన్స్ డే'

విజయనగరం జిల్లాలో...
సాలూరు మండలం పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. గ్లోబల్ వర్కింగ్, ఎలక్ట్రో మాగ్నెటిక్ జనరేటర్ వంటి ప్రదర్శనలను చూపరులను ఆకట్టుకున్నాయి. మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు.

చిత్తూరు జిల్లాలో...
'వైజ్ఞానిక రంగంలో స్త్రీలు' అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టడానికి తిరుపతి ఐసర్ సిద్ధంగా ఉందని ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. తిరుపతి ఇండియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్​లో శుక్రవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దక్షిణాది అంతర్ కళాశాలకు చెందిన రెండు వందల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

తూర్పుగోదావరి జిల్లాలో...
పి. గన్నవరం నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రదర్శనలు ఔరా అనిపించాయి.

అనంతపురం జిల్లాలో...
పెనుకొండలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెనుకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, గ్లోబల్ జెన్ పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు తయారుచేసిన వివిధ నమూనాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు వివిధ పాఠశాలల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఉరవకొండలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో న్యూట్రలైజేషన్ రియాక్షన్, వాటర్ ఫౌంటైన్, రేడియేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎన్విరాన్​మెంట్, రాకెట్ నమూనా వంటి ప్రయోగాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

కర్నూలు జిల్లాలో...
మద్దికేర బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సైన్స్​కు సంబంధించిన పలు అంశాలపై స్వయంగా తయారు చేసిన ప్రయోగాలను ప్రదర్శించారు. విద్యార్థులు తమలోని ప్రతిభను చాటుకునేందుకు ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుందని ఉపాధ్యాయురాలు రాజేశ్వరి అన్నారు.

ఇదీచదవండి.

వాడిన పూలతో అగర్‌ బత్తీలు..

ABOUT THE AUTHOR

...view details