ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేనేత వస్త్రాలు ధరించాలి.. నేతన్నకు అండగా ఉండాలి: ఎమ్మెల్యే కోలగట్ల - Vizianagaram News

State Level Handloom Exhibition: చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని.. నేతన్నకు అండగా ఉండాలని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వ చేనేత-జౌళి ఎక్స్​పోలో భాగంగా విజయనగరంలో వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలు, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు.

State Level Handloom Exhibition
State Level Handloom Exhibition

By

Published : Mar 12, 2022, 4:28 PM IST

State Level Handloom Exhibition: రాష్ట్రంలో నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వ చేనేత-జౌళి ఎక్స్​పోలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్‌ను కలెక్టర్ సూర్యకుమారితో కలసి ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలు, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శనకు రాష్ట్రంతో పాటు.. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 46 చేనేత సొసైటీలు హాజరయ్యాయని తెలిపారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వస్త్ర ప్రదర్శనలో 40 సొసైటీలకు దాదాపుగా రూ.2 కోట్ల సరుకు అమ్ముడుపోయిందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది రాష్ట్రస్థాయి ప్రదర్శన నిర్వహించటం జరుగుతోందన్నారు. చేనేత కార్మికులు.. నేత పనే జీవనోపాధిగా జీవిస్తున్నందునా.. ప్రజలు చేనేత వస్త్రాలను ఆదరించాలని కోరారు. ప్రభుత్వాలు ఎంత తోడ్పాటు అందించినా.. వస్త్రాలకు వినియోగదారుల నుంచి ఆదరణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. కరోనా ఫలితంగా నేతన్నల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రజలు వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 14 రోజులపాటు చేనేత వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:"వివేకా హత్య కేసులో... వారి ప్రమేయాన్ని కప్పిపుచ్చేందుకు సజ్జల ప్రయత్నిస్తున్నారు!"

ABOUT THE AUTHOR

...view details