విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయ పనుల పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మంది సభ్యులతో విమానాశ్రయ అభివృద్ది పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తూ పెట్టుబడులు, మౌలిక సదుపాయల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు.
భోగాపురం విమానాశ్రయ పనుల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు - bhogapuram airport news
భోగాపురం విమానాశ్రయ పనుల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది.
Bhogapuram airport
కమిటీ ఛైర్మన్‌గా పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిని, అలాగే సభ్య కన్వీనర్‌గా ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.