ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన నక్సల్స్ కాల్పుల్లో మరణించిన విజయనగరానికి చెందిన వీర జవాన్ రౌతు జగదీష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ హరి జవహర్ లాల్, విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి, మేయర్ విజయలక్ష్మి తదితరులు జవాన్ కుటుంబానికి అందజేశారు.
వీర జవాన్ రౌతు జగదీష్ కుటుంబానికి రూ.30లక్షలు అందజేత - routu jagadeesh death
ఛత్తీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ రౌతు జగదీష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన కుటుంబానికి రాష్ట్ర సర్కారు రూ.30 లక్షలు ఆర్థిక సహాయం అందించింది.

వీర జవాన్ రౌతు జగదీష్
వీర జవాన్ రౌతు జగదీష్
వీర జవాన్ రౌతు జగదీష్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్ తల్లిదండ్రులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం జగదీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీచదవండి.