ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భోగాపురం' పనులు చేపట్టాలని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురీకి బుగ్గన విజ్ఞప్తి - Union Civil Aviation Minister Hardeep Singh Puri news

భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు సత్వరమే చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా.... మంగళవారం కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసిన బుగ్గన భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి చర్చించారు.

Union Minister Bugna Rajendranath Reddy presents petition to Union Minister Hardeep Singh Puri
కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీకి వినతిపత్రం అందిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

By

Published : Oct 21, 2020, 8:25 AM IST

భోగాపురం విమానాశ్రయం పనులను సత్వరం ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీకి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్రమంత్రిని ఆయన మంగళవారం కలిశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయ పనులు తుది దశలో ఉన్నందున మిగిలిన అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించిన వినతిపత్రాలను కేంద్రమంత్రికి అందజేశారు.

అనంతరం ఆయన నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ను కలిశారు. మూత్రపిండాల సమస్య, యురేనియం ఆనవాళ్లు ఉన్న ప్రాంతాల్లోని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. తర్వాత బుగ్గన విలేకర్లతో మాట్లాడారు. విశాఖ నౌకాదళ విమానాశ్రయం నుంచి భోగాపురం విమానాశ్రయ పనులకు ఇవ్వాల్సిన అనుమతులు, విధివిధానాలపై కేంద్రమంత్రి పురీతో చర్చించినట్లు తెలిపారు. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఆ విమానాశ్రయానికి రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి పెట్టినందున లైసెన్సు రుసుములు, ఇతర మినహాయింపులు ఇవ్వాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details