ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్.సూర్యనారాయణ ఉత్తరాంధ్రలో పర్యటించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ను కలిశారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారవుతున్న నేపథ్యంలో... ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేతన సవరణ ప్రతిపాదనను ఈ బడ్జెట్లో పొందుపర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి' - State Employees Union State President KR Suryanarayana toured vizayanagram
వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చాలని... ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ