Pedapolamamba jathara: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం జిల్లా శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు వేళయింది. గ్రామ ఆనవాయితీ ప్రకారం ప్రతీఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.జాతరలో ప్రధాన ఘట్టం.. అమ్మవారిని చదురుగుడి ఆలయానికి తీసుకురావడం. శీబిల్లి పెద్దవలస సమీపంలో కొలువైన పెదపోలమాంబ అమ్మవారు సోమవారం శంబర గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని నడిమి వీధిలో అమ్మను ప్రత్యేక పూలతో కొలిచి ఆహ్వానించారు. అక్కడనుంచి మేళ తాళాలు, మహిళల కోలాటం, యువత కేరింతలతో చదురు గుడికి తీసుకువచ్చారు.
ఇక ఇప్పటినుంచి జాతర పూర్తయ్యేవరకూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జనవరి 3న తొళేళ్లు, 4న ప్రధాన ఉత్సవం, 5న అంపకోత్సవం జరగనున్నాయి. జనవరి 10వ తేదీన చిన్నమ్మవారు(పోలమాంబ)ని తీసుకువచ్చి 24, 25, 26 తేదీల్లో జాతర నిర్వహిస్తారు.