కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా పాడవుతున్నాయి. మార్గం మధ్యలో భారీ వాహనాలు దిగబడుతున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం-రాయగాడ రోడ్డు శివారులో ఓ భారీ లారీ దిగబడింది. ఫలితంగా విశాఖ నుంచి పార్వతీపురం మీదుగా ఒడిశా కు వెళ్లే వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సుమారు 2 గంటలు పాటు శ్రమించి లారీని పైకి లాగారు. అనంతరం వాహనచోదకులు ఊపిరిపీల్చుకున్నారు.
వర్షాలతో అధ్వాన్నంగా రోడ్లు..రాకపోకలకు అవస్థలు - rayagada
విజయనగరం జిల్లాలో రహదారులు రోజురోజుకి అధ్వాన్నంగా మారుతున్నాయి. పార్వతీపురం-రాయగడ రోడ్డు శివారులో ఓ భారీ లారీ దిగబడింది. రహదారిపై వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
పార్వతీపురం రాయగాడ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు