ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగాలు కావాలంటే... ఇక్కడ చేరండి..!

ఉద్యోగం చేయాలంటే... శిక్షణ తీసుకోవాలి. ముఖాముఖికి హాజరుకావాలి. ఈ భయాలే విద్యార్థుల్లో చూస్తుంటాం. కానీ ఓ కళాశాల విద్యార్థులకు మాత్రం అలాంటి భయమేం లేదు. కాలేజీకి వెళ్లామా..! ఎన్​సీసీలో ప్రవేశం పొందామా.. అంతే..! ఇంకా... ఉద్యోగం సాధించొచ్చు అని ధీమాగా ఉంటారు. రక్షణశాఖలో ప్రతి ఏటా అక్కడి విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నారు.

శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్​సీసీ విద్యార్థులు

By

Published : Nov 24, 2019, 5:47 PM IST

ఉద్యోగాలు కావాలంటే... ఇక్కడ చేరండి..!

విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో... ఎన్​సీసీ విభాగం విద్యార్థులు రక్షణశాఖ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. జిల్లాలో 6 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా... ఒక్క ఎస్.కోట కాలేజీలో మాత్రమే ఎన్​సీసీ విభాగం ఉంది. ఇక్కడ శిక్షణ పొంది బీ, సీ ధ్రువపత్రాలు సాధించిన క్యాడెట్లు... రక్షణశాఖ నిర్వహిస్తున్న పరీక్షల్లో సత్తా చాటుతున్నారు.

బీ, సీ పత్రాలు సాధించిన వారికి రక్షణ శాఖ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఉంది. ఫలితంగా సులువుగా కొలువు దక్కించుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే... ఈ కళాశాల విద్యార్థులు రక్షణ శాఖ ఉద్యోగాలకు కేరాఫ్​గా మారారు. 2002లో ప్రారంభమైన ఎన్​సీసీ విభాగం ద్వారా... ప్రతిఏటా పదిమందికి తక్కువ కాకుండా జాబ్​లో జాయిన్ అవుతున్నారు.

తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఆర్మీ ర్యాలీలో 9 మంది ఇక్కడి విద్యార్థులే ఎంపికవ్వడం విశేషం. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. రాధాకృష్ణ మాట్లాడుతూ... ఎన్​సీసీలో చేరడం ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగాలు సాధిస్తున్నారని... ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్​సీసీ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో క్యాడెట్లు... ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు.

ఇదీచూడండి.అధికారుల నిర్లక్ష్యం... సమస్యల వలయంలో వసతిగృహం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details