విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కారును.. ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. వేపాడ మండల సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్యే కారును లక్కవరపుకోట మండలం లచ్చంపేట గ్రామ సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు భాగం దెబ్బతింది.
ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన.. ద్విచక్ర వాహనం! - శృంగవరపుకోట ఎమ్మెల్యే కారు ప్రమాదం
శృంగవరపుకోట ఎమ్మెల్యే కారును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
sringavarapukota mla car and byke accident
ద్విచక్ర వాహనం నడుపుతున్న వేపాడ మండలం బల్లంకి గ్రామానికి చెందిన 16ఏళ్ల వబ్బిన శ్రావణ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కుడిచేయి, కుడికాలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన బాలుడి వెంట ఎమ్మెల్యే తన సిబ్బందిని ఇచ్చి పంపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:వెలుగు కార్యాలయంలో అవినీతి.. రూ.10 లక్షలు అక్రమ వసూళ్లు