ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతి తక్కువ మందితో.. రామనవమి వేడుక - విజయనగరం జిల్లా శ్రీ‌రామన‌వ‌మి వేడుక‌లు

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీ‌రామన‌వ‌మి వేడుక‌లు క‌న్నుల పండువ‌గా జ‌రిగాయి. సాంప్రదాయబ‌ద్దంగా సీతారాముల క‌ల్యాణాన్ని చూడ‌ముచ్చట‌గా నిర్వహించారు. కొద్దిమంది అధికారులు, ఆల‌య పూజారులు మిన‌హా.. భ‌క్తుల‌ు ఎవ్వరినీ వేడుక‌ల‌కు అనుమ‌తించ‌లేదు.

sri-ramanavami-celebrations-in-ramathirtham-in-vizianagarm-district
sri-ramanavami-celebrations-in-ramathirtham-in-vizianagarm-district

By

Published : Apr 2, 2020, 4:33 PM IST

నిరాడంబరం.. రామయ్య కల్యాణం

క‌రోనా నియంత్రణ‌లో భాగంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో అతికొద్ది మంది అతిథుల న‌డుమ విజయనగరం జిల్లా రామ‌తీర్థంలో శ్రీ‌రామన‌వ‌మి వేడుక‌ల‌ను నిరాడంబంరంగా నిర్వహించారు. సంప్రదాయ బ‌ద్దంగా ప్రభుత్వం త‌ర‌పున ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్పల‌నాయుడు దంపతులు... శ్రీ‌ సీతారామస్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాల‌ను, ముత్యాల త‌లంబ్రాల‌ను స‌మ‌ర్పించారు. స్వామివారికి ప్రభుత్వం స‌మ‌ర్పించిన ప‌ట్టువ‌స్త్రాల‌ను, ముత్యాల త‌లంబ్రాల‌ను అలంక‌రించి వైభ‌వంగా క‌ల్యాణాన్ని జ‌రిపించారు.

ఆన‌వాయితీ ప్రకారం సింహాచ‌లం వ‌రాహ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం నుంచి కూడా రామయ్యకు ప‌ట్టువ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాలను దేవ‌స్థానం అధికారులు అంద‌జేశారు. ఈ వేడుక‌ల‌ను తిల‌కించేందుకు సాధార‌ణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌న‌ప్పటికీ.. ఎప్పటిలాగే శాస్త్రోక్తంగా, సంప్రదాయానుసారం స్వామివారి కల్యాణాన్ని వైభ‌వంగా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details