ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర - విజయనగరం జిల్లాలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తాజా వార్తలు

ఉత్తరాంధ్ర ప్రజలు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చీపురుపల్లి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి అనంతరం మొదటి ఆదివారం జాతర ప్రారంభం కానుండగా.. మూడు రోజులపాటు జాతర మహోత్సవం కన్నుల పండువగా సాగనుంది.

sri kanaka mahalaxmi ammavari jatara
కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు

By

Published : Mar 15, 2021, 8:03 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర వైభవోపేతంగా జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు విరాజిల్లుతున్నారు.

శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి చరిత్ర..

గ్రామంలో అడ్డూరు వారి వంశానికి చెందిన ఆడపిల్లగా అమ్మవారిని చెప్పుకుంటారు. ఇక్కడ అడ్డూరు వారి వీధిలో అమ్మవారికి పురాతనమైన ఇల్లు సైతం ఉండటం విశేషం. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం కోవెల కూడా లేని అమ్మవారికి.. అడ్డూరు వారి వంశానికి చెందినవారు 1920లో విగ్రహం తయారు చేసి ప్రతిష్టించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం వారి తాతలు ముత్తాతలు పూజలు చేస్తుండగా.. కాల క్రమేనా మూడు మండలాల ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ఎంపీ బెల్లాన చంద్రశేఖర్..

1999లో అప్పటి ఎమ్మెల్యే గద్దె బాబురావు ఆధ్వర్యంలో మహాలక్ష్మీ అమ్మవారి జాతరకు శ్రీకారం చుట్టామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అప్పటినుంచి చూసుకుంటే ఇప్పుడు ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అమ్మవారి కరుణా కటాక్షాల కారణంగా ప్రతి ఏడాది వచ్చే భక్తులు సంఖ్య విశేషంగా పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక శాసన సభ్యులు, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కోవెలను మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

జాతరలో ప్రత్యేక ఆకర్షణగా...
జాతరలో ప్రత్యేక ఆకర్షణ బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యం సెట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన కళాఖండాలను విద్యుత్ కాంతులతో అలంకరించారు. జాతరకు వచ్చేవారు వీటిని వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

భారీ బందోబస్తు...
మూడు జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఇవీ చూడండి...

చీపురుపల్లిలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details