విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలోని జగన్నాథ స్వామి శ్రీ రాముని అవతారంలో దర్శనమిచ్చారు. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలలో 8వ రోజు పూజలు ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనల ప్రకారం భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి శ్రీ జగన్నాథ స్వామిని ఆలయంలో దర్శించుకుంటున్నారు. జులై 1న శ్రీ జగన్నాథ రథయాత్ర లయంలో జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు.
శ్రీ రాముని అవతారంలో శ్రీ జగన్నాథ స్వామి - విజయనగరం జిల్లా వార్తలు
శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో స్వామి శ్రీ రాముని అవతారంలో దర్శనమిచ్చారు. రథయాత్ర మహోత్సవాలలో భాగంగా మంగళవారం 8వ రోజు కావటంతో... కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తులు దర్శించుకుంటున్నారు.
శ్రీ రాముని అవతారంలో శ్రీ జగన్నాథ స్వామి..