విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. పురపాలక యంత్రాంగం కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. కమిషనర్ కనకమహాలక్ష్మి ఆదేశాల మేరకు.. హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. అన్ని వీధిలోనూ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన నివాస ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కమిషనర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
కరోనా నియంత్రణకు హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ - విజయనగరం జిల్లా వార్తలు
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు నియంత్రణ చర్యలు ముమ్మరం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.
Spray hydrochloride solution