విజయనగరంలో జిల్లాలో మొదటి దశలో ప్రారంభించిన నాడు - నేడు పనులను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ప్రాథమిక విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. రెండో దశ పనులను సుమారు రూ. 4 వేల 400 కోట్లతో ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు - నేడు పనులపై ఇంజినీర్లు, మండల విద్యాశాఖ అధికారులతో రాజశేఖర్.. కలక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. నాడు - నేడు పనులతో పాఠశాలలు దేవాలయాలుగా మారనున్నాయని అన్నారు. ఈ పనులు నాణ్యమైనవిగా ఉంటూ.. పది కాలాల పాటు శాశ్వతంగా నిలిచేలా ఉండాలని అన్నారు.
పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతోనే..
పిల్లలకు ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం జరిగేలా చూడాలని అధికారులను రాజశేఖర్ ఆదేశించారు. ఐదో తరగతి వరకు.. విద్యార్థలకు ఆహ్లాదాన్ని అందించేలా, పదో తరగతి వరకు.. విజ్ఞానవంతులుగా ఎదిగేలా తీర్చిదిద్దాలని తెలిపారు. నాడు బ్లాక్‌బోర్డ్‌లుగా ఉన్నవన్నీ.. నేడు గ్రీన్బోర్డ్లుగా మారాయని చెప్పారు. భవిష్యత్‌లో వైట్బోర్డులుగా మారాలని పేర్కొన్నారు. క్షేత్ర పర్యటనలో సందర్శించిన ఆయన కొన్ని పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. వాటిని మోడల్‌గా తీసుకోవాలని సూచించారు. నాడు - నేడు పనుల్లో భాగంగా మొదటి దశలో కొన్ని చోట్ల కాంట్రాక్టర్లతో పని చేయించారని.. రెండవ దశలో మాత్రం పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతోనే జరగాలని స్పష్టం చేశారు.
పెట్టుబడిగా భావిస్తోన్న ప్రభుత్వం..